జగన్ వ్యూహం సక్సెస్, మండలిలో బిల్లులు…!

-

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎట్టకేలకు వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉదయం నుంచి చోటు చేసుకున్న అనేక నాటకీయ పరిణామాల తర్వాత మండలి చైర్మన్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు గాను అనుమతిచ్చారు. మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరూ రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో తెలుగుదేశం ఎలా అయినా సరే,

రెండు బిల్లులను అడ్డుకునే విధంగా ఉదయం నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ముందుగా రూల్ నెంబర్ 71 ప్రకారం తాము ప్రతిపాదించిన అంశంపై తొలుత చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ముందు ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలంటూ వైసీపీ నేతలు ఉదయం నుంచి పట్టుబట్టారు. ఈ తరుణంలో ఉదయం నుంచి పలు మార్లు సభ వాయిదా పడుతూ వచ్చింది.

రూల్ 71 సరికాదని, ఈ క్రమంలో ఉదయం నుంచి సుమారు 15 మంది మంత్రులు శాసనమండలికి వెళ్లి తమ వాదనలు వినిపించారు. ఏడు గంటల తర్వాత చైర్మన్ బిల్లులు ప్రవేశ పెట్టారు. దీనితో తెలుగుదేశం పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. చైర్మన్ పోడియం వద్ద తమ నిరసన తెలియజేస్తున్నారు. అయితే మండలిలో ఏ విధంగా ఆమోదం పొందుతుంది అనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news