ఆన్ లైన్ చదువులు ఎఫెక్టివ్ గా ఉండాలంటే ఈ పనులు చేయాల్సిందే..

-

ఆన్ లైన్ లెర్నింగ్.. ప్రస్తుతం ఏది నేర్చుకోవాలన్నా ఈజీ అయిపోయింది. ప్రపంచంలోనే ఎన్నో రకాల కోర్సులను ఇంటి వద్ద నుండే నేర్చుకునే సౌలభ్యం కలిగింది. అయితే ఈ ప్రాసెస్ సరిగా లేకపోతే నేర్చుకున్నది తలకి ఎక్కదు. ఆన్ లైన్ లో ఏదైనా నేర్చుకునే వాళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ప్రశాంతమైన వాతావరణం:

ఆన్ లైన్‍లో నేర్చుకునేటప్పుడు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. మీరు ఇటుపక్క ల్యాప్ టాప్ ముందర వేసుకొని కూర్చుంటే అటుపక్కన ఇంట్లోని వాళ్ళు అరిస్తే మీరు ఏమీ నేర్చుకోలేరు. కాబట్టి మీకు ప్రత్యేకమైన స్పేస్ ఉండాలి.

సమయం చాలా ముఖ్యం:

సాధారణంగా క్లాసులో కూర్చోబెట్టి చెబితేనే అప్పుడప్పుడు తలకు ఎక్కదు. ఇక ఆన్ లైన్‍లో నేర్చుకునేటప్పుడు తలకు ఎక్కాలంటే ఏ సమయంలో నేర్చుకోవాలి అనేది చాలా ముఖ్యం. మీకు ఏ సమయంలో మూడ్ బాగుంటుంది, ఏ సమయంలో అయితే మీరు బాగా నేర్చుకోగలుగుతారు అనేది గుర్తించి ఆ సమయంలోనే ఆన్ లైన్ క్లాస్ వినండి.

సబ్జెక్టు తెలిసిన వాళ్లతో చర్చలు:

ఆన్ లైన్‍లో నేర్చుకునేటప్పుడు ముఖ్య సమస్య ఎక్కడ వస్తుందంటే.. సబ్జెక్టులో ఏదైనా సందేహం వస్తే కచ్చితంగా నేర్పించే వాళ్లనే అడగాలి. ఒకవేళ రికార్డ్ క్లాసెస్ వింటున్నట్లయితే దాని గురించి సబ్జెక్టు తెలిసిన వాళ్ళతో చర్చించాలి. ఇలా చర్చించాలంటే ఆ సబ్జెక్టు మీద ఆన్ లైన్‍లో ఉండే గ్రూపుల్లో జాయిన్ అవ్వాలి.

పొడొమోరో టెక్నిక్:

సిస్టమ్ ముందు గంటల తరబడి కూర్చోవడం మంచిది కాదు. దానివల్ల ఫోకస్ కుదురుగా ఉండదు. అందుకే పొమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. 25 నిమిషాలు గట్టిగా ఫోకస్ చేసి 5నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news