వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి శుభాకాంక్షలు – KTR సెటైర్లు

-

వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి శుభాకాంక్షలు అంటూ KTR సెటైర్లు పేల్చారు. కొడంగల్ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి కోసం విద్యార్థులతో ప్రత్యేకంగా పరేడ్ నిర్వహించారు అధికారులు. పాఠశాలకు వచ్చిన తిరుపతి రెడ్డికి ఎదురు వెళ్లి స్వాగతం పలికారు వికారాబాద్ జిల్లా కలెక్టర్. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడికి ఎలాంటి హోదా లేకపోయినా వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్వాగతం పలకడంపై విమర్శలు వస్తున్నాయి.

KTR

అయితే.. దీనిపై KTR సెటైర్లు పేల్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం… ఒక్క CM ని ఎన్నుకుంటే….ఇంకో అర డజన్ మంది ఫ్రీ గా వచ్చారని చురకలు అంటించారు. 1 + 6 ఆఫర్ సీఎం వ్యవస్థ ని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో! వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక…నాది ఒక చిన్న విన్నపం అన్నారు. ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను….IVRS పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండని సలహాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news