ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల భారిన పడుతున్నారు. కొందరు లావు ఎక్కువగా ఉండటం, ఫిజికల్ గా ఎక్కువగా కష్టపడకపోవడం, నిద్రలేమీ, ఒత్తిడితో కూడిన జీవితం కూడా ఇందుకు ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఎక్కువగా గుండెజబ్బుల బారిన పడటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా ఓ బాలిక కూర్చీలో కూర్చుని సెల్ ఫోన్‌తో ఆడుతుండగా ఒక్కసారిగా అలాగే కుప్పకూలిపోయింది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ బాలికకు ఎనిమిదేళ్లు ఉంటాయని తెలుస్తోంది. మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని గార్గి తరగతికి వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను అక్కడే ఉన్న చైర్‌లో కూర్చోబెట్టారు. ఈ క్రమంలోనే అలాగే కుప్పకూలగా.. పరీక్షించిన వైద్యులు బాలిక గుండెపోటుతో మరణించిందని తెలిపారు. సీసీ కెమెరాలో బాలిక ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.
గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది.
మూడో తరగతి విద్యార్థిని గార్గి క్లాస్‌కి వెళ్తుండగా అస్వస్థతకు గురైంది. అక్కడే ఉన్న చైర్‌లో కూర్చున్న ఆమె అలాగే కుప్పకూలిపోయింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. pic.twitter.com/dzlE965Ah4— ChotaNews App (@ChotaNewsApp) January 11, 2025