సంక్రాంతి పండుగ కూడా మాకు లేదు..24 గంటలు పనిచేస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రతి వాగ్దానంపై ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కి వెళ్ళదని…. పంట వేసే రైతులకు రైతు భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు పోదని తెలిపారు. ప్రతి వాగ్దానం పై హామీ కి కట్టుబడి వున్నామని చెప్పారు. సంక్రాంతి పండుగ కూడా మాకు లేదు… ఫుల్ టైం 24 గంటల పాటు పని చేస్తామన్నారు.
శనివారం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చేవని.. కానీ, తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వనుందని పేర్కొన్నారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఒక సెగ్మెంటుకు 3,500 చొప్పున ఇళ్లను కూడా కేటాయించామన్నారు. నాలుగు విడత్లలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.