సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మాజీ మంత్రి కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని చెప్పిన సుప్రీం కోర్టు… కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ చేసింది. దీంతో కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. దీంతో పిటీషన్ ను విత్ డ్రా చేసుకుంటామని చెప్పారు కేటీఆర్ తరపు న్యాయవాది.
దీంతో సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మాజీ మంత్రి కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. ఫార్మూలా ఈ కార్ రేస్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేటీఆర్.. సుప్రీంలో సవాల్ చేశారు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు వినింది. హైకోర్టు ఆదేశాలలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు కేటీఆర్ తరఫు న్యాయవాదులు తెలిపారు.