కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం

-

8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే సంగం చైర్మన్ ని నియమించనున్నది. వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమలులోకి రానున్నాయి. ఆటో స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించే పలు పథకాలను కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.3985 కోట్లతో మూడో స్పేచ్ లాంచ్ ఫ్యాడ్ నీ ఏర్పాటు చేయనున్నది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడి నేతృత్వంలో దిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. “1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటు అయ్యాయి. జాప్యానికి తావులేకుండా వేతన సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి సంకల్పించుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న పే కమిషన్ 2016లో ఏర్పాటు అయింది. ఆ వేతన సంఘం గడువు 2026లో ముగుస్తుంది. ఆ గడువు కన్నా ముందే, 2025లోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడం ద్వారా సరిపడా సమయం దొరుకుతుంది. 7వ పే కమిషన్ గడువు ముగియడానికి ముందే వేతనాల పెంపుపై సిఫార్సుల పొందేందుకు వీలు కలుగుతుంది. కొత్త కమిషన్కు ఛైర్మన్, ఇద్దరు సభ్యులను త్వరలోనే నియమిస్తాం” అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news