జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలి : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. అక్రమ కేసులపై మాకున్న ప్రతి హక్కును ఉపయోగించుకుంటాం అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పోరాడుతాం. తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అధికారిక సమావేశంలో చెప్పాడు. డాక్టర్ సంజయ్ కామెంట్స్ ను స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేల గల్లాలు పట్టి, కుక్కలను కొట్టినట్లు కొట్టాలని పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి అన్నాడు.

రేవంత్ రెడ్డి చెప్పినట్లు కౌశిక్ రెడ్డి కొట్టలేదు. జగిత్యాల ఎమ్మెల్యేను నువ్వు ఏ పార్టీ అని మాత్రమే అడిగాడు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రేమలో మునిగిపోయాయి. సీఎం తన పాత మూలాలను మర్చిపోవట్లేదు. అందుకే ఆర్ఎస్ఎస్ ను జపిస్తున్నాడు. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాదిరి మాట్లాడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు వేర్వేరు కాదు. కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేయటం సిగ్గుచేటు. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం కాంగ్రెస్ తో.. రాత్రికి బీజేపీతో సంసారం చేస్తున్నాడు. ఫార్ములా ఈ రేసు కేసు.. అక్రమ కేసు అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news