నల్గొండ రైతు ధర్నాకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

-

నల్గొండ రైతు ధర్నాకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని బీఆర్ఎస్ నేత  ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 21న బీఆర్ఎస్ నల్గొండ జిల్లాలో రైతు ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ రైతుల ధర్నాకరు బీఆర్ఎసక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జిల్లాల్లో గ్రామసభలు జరుగుతుండటం.. హైవే పై సంక్రాంతి రద్దీ కొనసాగుతున్న తరుణంలో ధర్నాకు అనుమతించడం లేదని తెలిపారు పోలీసులు.

తాజాగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రేపు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించబోయే రైతు ధర్నాకు అనుమతి లేకుండా అడ్డుకోవాలని చూడటం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు. ఒకపక్క రైతులందరూ రోజుకొకరు ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. మీరు పట్టించుకోరు. వారి కుటుంబాలను పరామర్శించరు. కనీసం బాధి కుటుంబానికి కూడా సహాయం చేయాలన్న మనస్తత్వం కూడా రావడం లేదు. సీఎం సింగపూర్ నదిలో బోట్ రైడ్ చేసుకుంట.. దావోస్ లో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news