GHMC అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల కు సంబంధించి సర్వే కొనసాగుతుంది అని పేర్కొన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం అని మాట ఇచ్చిన మంత్రి పొన్నం.. రేషన్ కార్డుల సర్వే నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
కాబట్టి సర్వేలో పేర్లు లేని వారు ఎవరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా అందుతాయి అని స్పష్టం చేసారు. ఇక ఇందిరమ్మ ఇళ్లు కేవలం స్థలం ఉన్న వారికే అని అపోహలు వద్దు. స్థలాలు లేని వారికి కూడా ఇస్తాం. కానీ ఎలా ఇవ్వాలనే విషయం పైనే కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అన్నారు. అదే విధంగా రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడానికి కూడా అవకాశం కల్పిస్తాము మంత్రి పొన్నం అన్నారు.