బంగారం కొనుగోలు చేస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పటి వరకు భారీగా పెరుగుతూ వస్తున్న ధరలు ఇప్పుడు దుగుతున్నాయి. గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం తగ్గుతుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 350 వరకు తగ్గడం విశేషం.
దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.41,480 వరకు వచ్చింది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 38,020 రూపాయల వద్దకు దిగి వచ్చింది. ప్రధానంగా హైదరాబాద్ మార్కెట్ లో గురువారం సాయంత్రానికి బంగారం తగ్గింది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
రానున్న రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే సూచనలు కనపడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. . వెండి ధరల విషయానికి వస్తే కేజీకి ఏకంగా ఒక్కసారే రూ.600 వరకు తగ్గింది. దీనితో కేజీ వెండిధర 49,600 నుంచి 49,000 రూపాయలకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కీలక నగరాలు అయిన విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.