దేశంలోని యువ మంత్రులలో మహారాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆదిత్య థాకరే ఒకరు. ముఖ్యమంత్రి అవుదామనుకుని పర్యాటక శాఖా మంత్రి అయ్యారు ఆయన. థాకరే కుటుంబం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి కూడా ఆయనే. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆదిత్య థాకరే కీలకంగా కూడా ఉన్నారు. దీనితో ఈ యువ మంత్రికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వస్తుంది.
ఇదిలా ఉంటే ఆదిత్య బుధవారం తన సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసాడు. అతని తాత, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జయంతి సందర్భంగా జ్ఞాపకార్థం ఆదిత్య ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.. ఈ చిత్రంలో బాల్ ఠాక్రే తన కార్యాలయంలో యువ ఆదిత్యను తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ఉంటారు. ప్రస్తుతం ఈ ఫోటో విస్తృతంగా వైరల్ అవుతుంది.
ఈ ఫోటో పోస్ట్ చేసిన వెంటనే వేల కొద్దీ లైక్స్ ని సంపాదించింది. కామెంట్స్ విభాగంలో ఆదిత్య అభిమానులు వేలాది మంది మరియు అనుచరులు బాల్ ఠాక్రేకు నివాళి అర్పించారు. 1926 లో పూణేలో జన్మించిన బాల్ ఠాక్రే శివసేనను స్థాపించి దేశ రాజకీయాలను సైతం శాశించడమే కాదు. దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబై ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయన నవంబర్ 17, 2012 న ముంబైలో మరణించారు.