కర్ణాటక రోడ్డు ప్రమాదం పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

కర్ణాటక లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం  వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. రఘునందన తీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు, ఆ వాహన డ్రైవర్ మృతి చెందడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు.

విద్యార్థుల మృతి తీవ్ర ఆవేదన కలిగించిందని తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు హంపిలో ఆరాధనోత్సవానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారని తెలిసిందని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news