IND Vs ENG : రికార్డు సృష్టించిన బౌలర్ అర్ష్ దీప్ సింగ్..!

-

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో ఇంగ్లండ్ వర్సెస్ టీమిండియా మధ్య తొలి టీ-20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ చేస్తోంది. అయితే భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్ వేసిన మూడో బంతికే ఓపెనర్ ఫిల్ సాల్ట్ ను పెవిలీయన్ కు పంపాడు. తన రెండో ఓవర్ లో మరో ఓపెనర్ బెన్ డకెట్ ను ఔట్ చేసిన అర్ష్ దీప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ-20లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ అర్ష్ దీప్ రికార్డులకెక్కాడు.

బెన్ డకెట్ ను ఔట్ చేసిన అర్ష్ దీప్ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 61 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. 97 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డు భారత స్పిన్నర్ యుజేంద్ర చాహల్ పేరిట ఉండేది. చాహల్ 80 మ్యాచ్ ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్ తో చాహల్ రికార్డును అర్ష్ దీప్ సింగ్ బ్రేక్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news