విశాఖ శారదా పీఠానికి ఆంధ్రప్రదేశ్ హై కోర్టు షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హై కోర్టు. లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
శారదా పీఠం తిరుమలలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతోందంటూ తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శారదా పీఠం అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నా కూడా.. టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ పిటిషనర్ తన పిటిషన్లో ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్ను గతంలోనే విచారించిన ఏపీ హైకోర్టు భవన నిర్మాణాన్ని ఆపివేయాలని శారదా పీఠాన్ని ఆదేశించడం జరిగింది.
విశాఖ శారదా పీఠానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్
తిరుమలలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశం
లేనిపక్షంలో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం
శారదా పీఠం తిరుమలలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతోందంటూ తిరుమల క్షేత్రాల రక్షణ సమితి… pic.twitter.com/uuWGGz1sQQ
— Pulse News (@PulseNewsTelugu) January 23, 2025