సంక్షేమాన్ని ఓర్వలేకనే అవాకులు, చవాకులు.. ప్రతిపక్షాలపై పొంగులేటి ఫైర్..!

-

ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం అని, మంచి చేసే ప్రభుత్వాన్ని కించపరుస్తూ.. వీధి గుండాలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని ప్రతిపక్షాల నాయకులపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా, మంత్రి పొంగులేటి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా జల్లేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమాలను చూస్తూ.. ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంచిని గుర్తించలేని ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో, గత పది సంవత్సరాల పాలనలో, గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీర్చగలిగారా, నూతన రేషన్ కార్డులు అందించారా, నివాసం ఉండేందుకు ప్రజలకు ఇండ్లు నిర్మించారా అని ప్రశ్నించారు.


రెండు పర్యాయాలు అధికారంలో ఉండి గడ్డి మాత్రమే పీకారని మండిపడ్డారు. చేత కాకపోతే మూసుకొని
కూర్చోవాలని ఆయన ఫైర్ అయ్యారు. మంచిని గుర్తించి, మంచి సలహాలు ఇస్తే కనీసం స్థానిక
ఎన్నికల్లో డిపాజిట్లు అయినా దక్కుతాయని హితవు పలికారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి
ప్రభుత్వమని, పేదోడు బాగుండడం కోసం తహతహలాడేదే ఇందిరమ్మ ప్రభుత్వం అని అన్నారు.
అరత ఉండి సంక్షేమాల జాబితాలో పేరు లేని అర్హులు, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news