ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే నీటి పంపకాలపై విచారణ చేపట్టాలని 2023 అక్టోబర్ 23 నాడు కేంద్రం నోటిషికేషన్ జారీ చేసింది. దీంతో ఈ నోటిఫికేషన్‌పై ఇటీవల బ్రిజేష్ ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నీటి పంపకాలపై తీర్పు ఇచ్చింది. అయితే నీటి వాటాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు 2 రిఫరెన్సులను ట్రైబ్యునల్‌లో దాఖలు చేశాయి.
ఈ వివాదంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రైబ్యునల్‌లో దాఖలైన 2 రిఫరెన్స్ ల విచారణ పై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్
చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కృష్ణా ట్రైబ్యునల్ నీటి పంపకాలను మెన్షన్ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వ ప్రస్తావనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని ఆదేశించింది.