పవన్ కళ్యాణ్ సీటుకే ఎసరు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీటుకు తెలుగు తమ్ముళ్లు ఎసరు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పేపర్లో తెలుగు తమ్ముళ్లు పలు యాడ్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇదిలాఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉన్న పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవులను నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారు. పలు పత్రికల్లో పెద్ద ఎత్తున యాడ్స్ ఇవ్వడంతో ఈ విషయంపై జనసైనికులు గుర్రుగా ఉన్నారు. మొన్నటివరకు నారాలోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుతమ్ముళ్లు పెద్దఎత్తున ప్రచారం చేయగా.. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.ఈ విషయంపై ఇతర మంత్రులు, నేతలు మాట్లాడవద్దని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news