Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు అనౌన్స్ చేసింది. ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ వి.నరేందర్ రెడ్డి పేరును ప్రకటించింది ఏఐసీసీ.
ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఆల్ఫో ర్స్ విద్యాసంస్థల అధినేత వీ. నరేందర్ రెడ్డికి కరీంనగర్ లో చాలా కాలేజీలు, విద్యాసంస్థలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో.. దాదాపు 30 ఏళ్లుగా… ఆల్ఫో ర్స్ విద్యాసంస్థలను నడిపిస్తున్నారు. ప్రజలల్లో ఆల్ఫో ర్స్ విద్యాసంస్థలపై మంచి అభిప్రాయమే ఉంది. అందుకే కాంగ్రెస్…ఆల్ఫో ర్స్ విద్యాసంస్థల అధినేత వీ. నరేందర్ రెడ్డిని ఎంపిక చేసినట్టు ప్రకటించింది.
- ఉమ్మడి నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన
- ఆల్ఫో ర్స్ విద్యాసంస్థల అధినేత వీ. నరేందర్ రెడ్డిని ఎంపిక చేసినట్టు ప్రకటించిన కాంగ్రెస్