తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కులగణన నివేదికను ఈ రోజు మధ్యాహ్నం ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీ కి అందజేశారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా బృందం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి కులగణన కు సంబంధించిన నివేధికను ఈ రోజు సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కులగణన నివేదికను అందుకున్నారు.
తాజాగా మీడియాతో సమావేశంలో కులగణన సర్వే గురించి వెల్లడించారు. ఆ తరువాత ఎల్లుండి క్యాబినెట్ భేటీ లో సర్వేను ప్రవేశపెడతామని.. అలాగే అదేరోజు శాసనసభలో కులగణన సర్వేను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాందీ కోరిక మేరకు సర్వే చేపట్టామని తెలిపారు. దేశంలోనే ఈ సర్వే ఒక చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసింది.