తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ ను మరో అవార్డు వరించింది. గత 25 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సోలార్ ఇండస్ట్రీ కోసం చేస్తున్న నిరంతర కృషిని గుర్తించి రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆయనకు ‘సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ అవార్డ్ బహుకరించాయి.
ఆదివారం తెలంగాణ టూరిజం భవన్ లో జరిగిన సోలార్ టెక్నికల్ సెమినార్ లో తెలంగాణ రెన్యువబుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, TGSPDCL సంస్థలకు చెందిన నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతికేళ్ళ నుంచి రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్న తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్ర అశోక్ కుమార్ గౌడ్ కు ‘సోలార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ అవార్డును అందించారు.