ఐటీ ఆఫీస్కు నిర్మాత దిల్ రాజు వెళ్లారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లతో ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల నాలుగు రోజులు దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సినిమాల నిర్మాణం, ఎగ్జిబిటర్ల వివరాలపై అధికారులు ఆరా తీశారు. ఇది ఇలా ఉండగా… నాలుగు రోజులపాటు దిల్ రాజు ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు.. ఎలాంటి డబ్బులు గుర్తించ లేదన్న సంగతి తెలిసిందే. ఈ తరునంలనే… దిల్ రాజ్ వ్యాపారాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు ఐటి అధికారులు. సినీ నిర్మాణం , ఎగ్జిబిటింగ్, విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై ఆరా తీశారు. సంక్రాంతి సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేశారు దిల్ రాజు. అటు దిల్ రాజ్ తో పాటు పలువురు నిర్మాత దర్శకుడు ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఐటీ.