తెలంగాణలో 1.64 కోట్ల మంది బీసీలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. తెలంగాణలో 46.25 శాతం మంది బీసీలు ఉన్నారని కులగణన సర్వే వివరాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం.. ఎస్సీలు 61.84 లక్షలు అనగా 17.43 శాతం ఉన్నారని తెలిపారు. ఎస్టీలు 37.05 లక్షలు.. 10.45 శాతం మంది, అలాగు ముస్లిం బీసీలు 35.76 లక్షలు.. 10.08 శాతం ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఓసీల జనాభా 41.21 లక్షలు అనగా 13.31 శాతంగా ఉన్నదని తెలిపారు.
బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే కులగణన చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి పొరపాటు జరగకుండా కులగణనను సర్వే చేపట్టామని తెలిపారు. మొత్తం 56 శాతానికి పైగా ఉన్న బీసీలందరికీ సముచిత న్యాయం కల్పించాలని ప్రభుత్వం సభలోకి తీసుకొచ్చిందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉందని కోరారు. 75 ఏళ్ల తరువాత కూడా బలహీన వర్గాల లెక్క లేదని తెలిపారు.