కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సర్వేలో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సర్క్యులేట్ డాక్యుమెంట్ తీసుకొచ్చి సభను తప్పు దోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఈ డాక్యుమెంట్ గత ప్రభుత్వం ఎందుకు శాసన సభలో ప్రవేశపెట్టలేదో అని తెలిపారు. పాయల్ శంకర్ అపోహలు సృష్టించాలని చూస్తున్నారని ప్రశ్నించారు. అర్థం పర్థం లేని కాగితాలు తీసుకొచ్చి సభను పక్కదోవ పట్టించకూడదని సూచించారు.
ఇన్ని రోజులు గత ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. అపోహల సంఘం మాటలను పాయల్ శంకర్ మాట్లాడుతున్నారు. కానీ మా ప్రభుత్వంలో 15 శాతం ఓసీలు ఉన్నారని తెలిపారు. చట్టపరంగా 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం సీట్లు ఇస్తుంది.. మీ రెండు పార్టీలు సవాల్ విసురుతున్నా.. ఇందుకు మీరు సిద్దమా..? కాదా..? అని ప్రశ్నించారు.