రాహుల్ గాంధీ పై కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ.. మీ పేరుని ‘ఎన్నికల గాంధీ’గా మార్చుకోండి అంటూ ఫైర్ అయ్యారు. ట్విటర్ మాధ్యమంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్… రాహుల్ గాంధీ.. మీ పేరుని ‘ఎన్నికల గాంధీ’గా మార్చుకోండి అన్నారు.
బీసీ డిక్లరేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని.. అసెంబ్లీ సమావేశాలతో తేటతెల్లమైందని చురకలు అంటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశం మీకెప్పుడూ లేదని స్పష్టమైపోయిందన్నారు కేటీఆర్. మీరు ఇచ్చిన వాగ్ధానాలు, హామీలన్ని కేవలం ‘పొలిటికల్ జుమ్లా’లని మరోసారి రుజువైంది… ఎలాంటి స్పష్టత లేని ఓ విధ్వంసకర ప్రభుత్వం మీది.. అంటూ తారాస్థాయిలో మండిపడ్డారు కేటీఆర్.