రైతులకు బాసటగా నిలువాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆనంతను.. ఫ్రూట్ బౌల్ ఆప్ ఇండియా అనంతగా మార్చాలని చూస్తున్నాం అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పండించిన పంటలకు మంచి ధరలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు ఉపయోగపడే దాదాపు 100 కంపెనీలు ఇవాళ పాల్గొన్నాయి. తెలుగుదేశం రైతులకు సాయం చేయాలనే ఆలోచన చేస్తుంది. గత ఐదేళ్లలో రైతులకు ఒక్క అవకాశం కల్పించపోగా.. అభివృద్ధి ఆపేశారు. రైతులకు ఆదాయం సమకూర్చలనేదే మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం. త్వరలోనే రైతుల కోసం విస్త్రతస్థాయి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాం.
రైతులకు నర్సరీ నుంచి మార్కెట్ వరకు ప్రభుత్వం సహాయం ఉంటుంది. ఇది రైతుల ప్రభుత్వం.. రైతుల కోసం అన్ని రకాల ఆలోచనలు చేస్తున్నాం. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. 7 నెలల కాలంలో కొంత ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చాం. తెలుగుదేశం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. అనంతకు నీరు ఇస్తే మీసం మెలేసి రైతులు పంటలు పండిస్తారు. హంద్రీనీవా కాలవ పనులు పూర్తి చేసి నీరు అందిస్తాం అని మంత్రి తెలిపారు.