కూన రవికుమార్ పై మండిపడ్డ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ప్రపంచం, దేశాలలో దర్మల్ పవర్ ప్లాంట్ వద్దు అని వదిలేస్తున్నారు. కాకరాపల్లి, సోంపేటలో దర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా పోరాటం చేసారు. దర్మల్ పవర్ ప్లాంట్ వలన గాలి, నీరు కాలుష్యం అవుతుంది. 16 వందల ఎకరాల భూమి ఏవరి దగ్గర తీసుకుంటారు. గిరిజన ప్రజలు భూమి తీసుకుని దర్మల్ పవర్ ప్లాంట్ కడతారా. గిరిజన శవాలు పైన దర్మల్ పవర్ ప్లాంట్ కడతారా. దర్మల్ పవర్ ప్లాంట్ వలన ఆడ బిడ్డలకు పిల్లలు పుట్టరు. ప్రజలకు ఏవిధమైన సెక్యూరిటీ ఇస్తారు.
దర్మల్ పవర్ ప్లాంట్ పెడితే పోరాటం చేస్తాం. దర్మల్ పవర్ ప్లాంట్ కు నీరు ఎక్కడ నుండి తెస్తారో చెప్పండి. రైతులకు నీరు పూర్తి స్థాయిలో ఇవ్వటం లేదు. దర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తే అడ్డుకుంటాం,పోరాటం చేస్తాం. రైతులకు అండగా ఉంటాం. దర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి వీళ్ళులేదు. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు,రైతు సంఘాలు, మేధావులను, కలుపుకొని దర్మల్ పవర్ ప్లాంట్ పై పోరాడతాం. దర్మల్ పవర్ ప్లాంట్ తయారీ చేసి మన దేశానికి ఒక యూనిట్ ఉపయోగం లేదు, ఇక్కడ తయారు చేసిన విద్యుత్ ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు తమ్మినేని సీతారాం అన్నారు.