ప్రముఖ నటుడు సోనూసూద్‌కు బిగ్ షాక్ తగిలింది. నటుడు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10 లక్షలు మోసం చేశాడని.. దీనికి సూనూసూద్ సాక్షి అని పేర్కొంటూ కేసు వేశారు లుథియానాకు చెందిన అడ్వకేట్ రాజేశ్ ఖన్నా.
ఈ తరునంలోనే… ‘రిజికా కాయిన్’ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు వెల్లడించారు. అయితే.. ఈ కేసును విచారణ చేపట్టిన కోర్టు.. సోనూసూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. సోనూసూద్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక నటుడు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ కావడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.