ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..వాట్సాప్‌లో ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు రానున్నాయి. ఈ మేరకు ప్రకటన వచ్చేసింది. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇంటర్ విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు హాల్ టికెట్లు నిలిపివేయడం వంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/AP-Inter-Exams.webp)
హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా మనమిత్ర పేజీ ద్వారా విద్యార్థులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీంతో వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతో ఏపీ ఇంటర్ విద్యార్థులు ఫుల్ జోష్ లో ఉన్నారు.