తెలంగాణ లాసెట్, పీజీ ఎల్ సెట్ షెడ్యూల్ విడుదల

-

లా కోర్సులో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీ ఎల్ సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ని శనివారం విడుదల చేసింది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి 01 నుంచి మే 25వ తేదీ వరకు లేట్ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. అదేవిధంగా జూన్ 06న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.

మూడేళ్లు, ఐదేళ్లు ఎల్ఎల్బీ కోర్సులు, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సు లకు అర్హతలను పరిశీలించినట్టయితే.. మూడేళ్ల LLB కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటేడ్ LLB కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారు డిగ్రీతో పాటు ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరిన్ని వివరాల కోసం lawcetadm.tsche.ac.in ను సంప్రదించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news