వాళ్లదే మళ్లీ అధికారం.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్..!

-

టాలీవడ్ సెన్షేషనల్ ప్రొడ్యూసర్ ప్రముఖ కమెడీయన్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కమెడియన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత నిర్మాతగా మారిపోయారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈయన.. సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కూడా స్పందిస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ఎవ్వరినీ ఉద్దేశించి పెట్టారో తెలియదు.. కానీ పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది. గెలిచిన వానికి ఓటమి తప్పదు.. ఓడిన వానికి గెలువత తప్పదు అనివార్యమైన ఇటి విషయమై శోకింప తగదు అంటూ రాసుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు కాబట్టి మళ్లీ వాళ్లు విజయం సాధిస్తారని బండ్ల గణేష్ ట్వీట్ కు స్పందించడం విశేషం. మరోవైపు బండ్ల గణేష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి..? అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా కాస్త దూరంగానే ఉంటున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news