తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జీ కిరణ్ రాయల్ పై లక్ష్మీ అనే మహిళా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ ను వైసీపీ నేతలు ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఆయన స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం పీక్కుంటారో పీక్కోండి.. వైసీపీ సోషల్ మీడియా పై కిరణ్ రాయల్ ఫైర్ ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డులు అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ఏం చేస్తారో చేసుకోండి.
పవన్ కళ్యాణ్ భక్తుడిగా, ఆయన అభిమానిగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతానని పేర్కొన్నారు. నాకు పెద్ద కుటుంబం ఉంది. వాళ్లు మాట్లాడింది రాదా..? నేను మాట్లాడింది మాత్రమే ఆడియోలు, వీడియోలు వినిపిస్తున్నాయి. వాళ్లు మాట్లాడినవి మాత్రం లేవు. కిరణ్ రాయల్ డ్యాన్స్ వేస్తే తప్పు.. చాట్ వేసుకుంటే తప్పు. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని పేర్కొన్నారు. జనసేన నుంచి వివరణ ఇవ్వాలని చెప్పారు. తప్పకుండా వివరణ ఇచ్చిన తరువాత మీడియా వద్దకు వస్తానని తెలిపారు కిరణ్ రాయల్.