భారతీయ సంప్రదాయంలో వంటల్లో రుచిని, సువాసను, ఆరోగ్యాన్ని ప్రసాదించే కొన్ని దివ్య ఔషధాన్ని మన బుుషులు అందించారు. అలాంటివాటిల్లో ధనియాలు అతిముఖ్యమైన కోవకు చెందుతాయి. చాలావంటల్లో ధనియాలు పొడి వేస్తుంటాం. ధనియాలు అనేవి జీర్ణవ్యవస్థకు పెట్టింది పేరు. ఆకలి పుట్టించడానికి, అరుగుదల బాగా చేయటానికి, తిన్నది వంటికి పట్టేట్లు చేయడానికి ధనియాలు చక్కగా ఉపయోగపడతాయి.. ధనియాల వెనుక ఉన్న లాభాలను సైంటిఫిక్ గా రెండు యూనివర్శిటీలో స్టడీ చేసి అందించాయి. ఈరోజు రెండు పరిశోధనల ద్వారా ఏం అందించారు అనేది తెలుసుకుందాం.
100 ధనియాల్లో ఉండే పోషకవిలువలు
- శక్తి 268 కాలరీలు
- పిండిపదార్థాలు 13 గ్రాములు
- మాంసకృతులు 11గ్రాములు
- ఫ్యాట్ 17 గ్రాములు
- పీచుపదార్థాలు 45 గ్రాములు. చాలా హై ఫబర్..ధనియాలపైన ఉండే తొక్క అంతా ప్రేగులను క్లీన్ చేసుకోవడానికి కొవ్వు రక్తంలోపలికి చేరకుండా నిరోధించడానికి ధనియాలపైన ఉండే పీచు ఉపయోగపడుతుంది.
- కాల్షియం 718 మిల్లీ గ్రాములు. పాలల్లో కంటే ఎక్కువ.
- మెగ్నీషియం 343 మిల్లీ గ్రాములు
- విటమిన్ K1 35 మైక్రోగ్రాములు
ఇవన్నీ ధనియాల్లో ఉండే పోషకాలు..ధనియాలను ఆహారపదార్థాల్లో వాడుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయని సైంటిస్టులు ఇచ్చారంటే..
2008 వ సంవత్సరంలో హిందు కాలేజ్ ఆఫ్ బెంగుళూరు( Hindu College -Bengaluru) వారు పరిశోధన చేసి..ధనియాలు గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించడానికి అద్భుతంగా పనికొస్తున్నాయని వీళ్లు తెలిపారు. ఇందులో ఉండే పీచులు కొవ్వుపదార్థాలు బ్లడ్ లోకి వెళ్లకుండా.ప్రేగులనుంచి కిందకు తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుందని కనుగొన్నారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) ను మలం ద్వారా బయటకుపంపే గుణం ధనియాలకు ఉందని తెలిపారు.
ఇంకా అతి ముఖ్యమైన లాభం ఏంటంటే..మన లివర్ కొలెస్ట్రాల్ ను తయారుచేస్తుంది. మన బాడీకీ రోజుకు 300 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ కావాలి. ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలు. గుడ్ కొలెస్ట్రాల్ (HDL) ఇది 40- 50 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ ఉంటే చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) అనేది 100మిల్లీ గ్రాముల లోపు ఉండాలి. లివర్ ఈ రేషియో ప్రకారం కొవ్వను తయారు చేయాలి. ఈ రేషియో ప్రకారం కొలెస్ట్రాల్ తయారు చేసిన లివర్ కి ధనియాల్లో ఉండే పైటోస్టిరాల్స్( Phytosterols) ఫైటోకెమికల్స్( Phytochemicals) లివర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవడానికి కావాల్సిన ఎంజైమ్స్ ని ఈ కెమికల్స్ ఆపేస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఎంజైమ్స్ తయారవవో..బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఫామ్ అవదు.
మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను HDL అనే గుడ్ కొలెస్ట్రాల్ క్లీన్ చేస్తూ ఉంటుంది. లివర్ ఈ వేస్టేజ్ అంతంటిని బైల్ జ్యూస్ లో పెట్టి ప్రేగుల్లోకి వదులుతుంది. ప్రేగుల నుంచి మళ్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం మంచి ఫుడ్ తినకుండా..జంక్ ఫుడ్స్ లాంటివి తింటుంటే..ఇది మళ్లీ లివర్ లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ ధనియాలు ఉన్నాయంటే..లివర్ లోంచి ప్రేగుల్లోకి వచ్చిన బ్యాడ్ కొలెస్ట్రాల్ రిఅబ్సార్వ్ కాకుండా ధనియాల్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను మలం ద్వారా బయటకు పంపించేస్తున్నాయి. ధనియాల్లో ఉండే ఆల్కలాయిడ్స్( Alkalodis) ఫేవన్స్( Flavonoids),రెజిన్స్ ముఖ్యంగా డైజిషన్ కు బాగా ఉపయోగపడతాయి.
ధనియాలు డైజెస్టీవ్ సిస్టమ్ ను రెగ్యులేట్ చేసి ఇన్ డైజెషన్ తొలగించడానికి, ఆకలి పుట్టించడానికి నిరూపించినవారు 2013వ సంవత్సరంలో మషత్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇరాన్( Mashhad University Of Medical Science- Iran). ఆకలి మందం, అజీర్ణ సమస్యలు ఉంటే..ధనియాలు మరిగించి తేనె కలుపుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
తగు మోతాదులో వంటల్లో వాడుకుంటే చక్కటి లాభాలు అందుతాయి. ఎక్కువ మంచిదికాదు..ధనియాలు నీళ్లలో వేసి మరిగించి..ఆ నీళ్లకు మరియాలు పొడి , తేనె కలుపుకుని తాగితే..డైజెషన్ సమస్యను నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ రకంగా ధనియాలను వాడుకుంటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉన్నాయని సైంటిఫిక్ గా రుజువైంది కాబట్టి అవసరానికి తగ్గట్టుగా వాడుకోవచ్చు.