ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేయబోతున్నారు. కేంద్ర బిజెపి ఆదేశాల మేరకు… ఇవాల్టి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. మూడు రోజులపాటు… దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నిటిని సందర్శించబోతున్నారు పవన్ కళ్యాణ్.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/pawan-kalyan-1.jpg)
ముఖ్యంగా అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, అలాగే శ్రీ పరమ రామస్వామి, అగస్త్య జీవ సమాధి , కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా… పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలోనే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేందుకు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. బిజెపి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు.