రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి కోళ్లు మృత్యువాత పడుతుంటూ కొందరు అక్రమార్కులు ఏకంగా కుళ్లిన చికెన్ జనాలకు విక్రయించి డబ్బులు పోగెసుకుంటున్నారు. ఇప్పటికే చికెన్ తినకూడదని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సైతం ఆర్డర్స్ పాస్ చేసింది. తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదు.
ఈ క్రమంలోనే అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. భారీగా మోతాదులో కుళ్లిన చికెన్ పట్టుబడింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నానగర్ చికెన్ సెంటర్స్లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు గురువారం తనిఖీలు చేశారు.రెండు షాపుల్లో తనిఖీలు చేయగా సుమారు 5 క్వింటాళ్ల (500కేజీల) కుళ్ళిన చికెన్ కనిపించింది. దీంతో అధికారులు కుళ్లిన చికెన్ను సీజ్ చేసి నిర్వాహకుల మీద చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
భారీగా మోతాదులో పట్టుబడ్డ కుళ్లిన చికెన్….
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అన్నా నగర్ చికెన్ సెంటర్స్లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, కంటోన్మెంట్ బోర్డు హెల్త్ అధికారులు తనిఖీలు చేశారు. రెండు షాపుల్లో తనిఖీలు చేయగా సుమారు ఐదు క్వింటాళ్ల కుళ్ళిన చికెన్ కనిపించింది.… pic.twitter.com/pzVCjJjvnA
— ChotaNews App (@ChotaNewsApp) February 14, 2025