11 ఏళ్ల నాటి ఫొటోను షేర్ చేసిన హరీశ్ రావు..!

-

తెలంగాణ చరిత్ర లో ఫిబ్రవరి 18కి ప్రత్యేకత ఉన్నది. 2014, ఫిబ్రవరి 18వ తేదీన లోక్ సభ లో తెలంగాణ బిల్లు  ఆమోదించబడింది. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. బిల్లు ఆమోదించిన తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో  కేసీఆర్ తో సంబురాలు చేసుకుంటున్న ఫొటోను హరీష్ రావు పోస్టు
పెట్టారు.

కేసీఆర్  దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజా ఉద్యమం విజయం సాధించిన రోజు అని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగా జరిగే ప్రజాఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సందర్భమని, పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన రోజు అని పేర్కొన్నారు. హరీశ్ రావు షేర్ చేసిన ఫొటోలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు,  శ్రీనివాస్ గౌడ్, విఠల్ తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news