ఆంధ్రప్రదేశ్ లో రేపు జరగాల్సిన గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా అభ్యర్థులు చేస్తున్నటువంటి విన్నపాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్ కి లేఖ ద్వారా సూచించింది. దీంతో కొద్ది రోజుల వరకు గ్రూపు-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. APPSC కార్యదర్శికి ప్రభుత్వం లేఖ రాసింది.
మరోవైపు అంతకు ముందే సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించింది ఏపీపీఎస్సీ. వాస్తవానికి రేపు ఉదయం 10గంటల నుంచి 12.30 గంటలకు పేపర్ -1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ తాజాగా వాయిదా పడింది. త్వరలోనే తేదీలను వెల్లడించనుంది ఏపీపీఎస్సీ.