ఈనెల 24న మంచిర్యాలకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిర్వహించే పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరుకానున్నారు. సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు.
ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్- నిజామాబాద్ జిల్లాల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీల కోసం పోటీ చేస్తున్న అల్పోర్స్ అధినేత నరేందర్ రెడ్డి తరపున వీరు ప్రచారంలో పాల్గొననున్నారు. నస్పూర్ కలెక్టరేట్ ముందుగల ఆవరణలో కాంగ్రెస్ చేపట్టిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మెళన సభకు సీఎం వస్తుండటంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్సురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు సభా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా నుంచి భారీ ఎత్తున కార్యకర్తలను, ప్రజలను తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని ఆదేశించారు.