ప్రజలు వాటికి దూరంగా ఉండాలి : ప్రధాని నరేంద్ర మోడీ

-

ప్రజలు క్యాన్సర్కు కారణమయ్యే సిగరెట్, బీడీ, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ  విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్ లోని  ఛత్తారుర్ లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చి సెంటర్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం తనకు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిందన్న ప్రధాని.. సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రంపై దృష్టిసారించానన్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభమేళా దేశ ఐక్యతకు చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తూ నే ఉంటుందన్నారు. కోట్లాది మంది తరలి వస్తున్న మహా కుంభమేళాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు.

భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నవారిపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. “ఇటీవల కాలంలో ప్రజల్ని విభజించే నేతల గుంపును చూస్తున్నాం. అనేక సార్లు విదేశీ శక్తులు సైతం ఈ వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్దాలుగా ఏదో ఒక దశలో విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతి వంటి సూత్రాలపై దాడి కొనసాగిస్తున్నారని తెలిపారు ప్రధాని మోడీ. 

Read more RELATED
Recommended to you

Latest news