Tirumala: హాట్ కేకుల్లా తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో టీటీడీకి 15.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఆన్ లైన్ లో మే నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేసింది టిటిడి. ఈ తరునంలోనే.. 2 నిమిషాల వ్యవధిలోనే అంగప్రదక్షణ టిక్కెట్లు పోందారు భక్తులు. 10 నిమిషాల వ్యవధిలోనే వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు పోందారు శ్రీ వారి భక్తులు.

ఇవాళ 4 లక్షల 8 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్లో విడుదల చేసిన చేసింది టీటీడీ పాలక మండలి. 20 నిముషాల వ్యవధిలోనే టిక్కెట్లు కోనుగోలు చేశారు శ్రీవారి భక్తులు. దీంతో టిటిడి ఖజానాకు 12.24 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా అందుబాటులో శ్రీవాణి దర్శన టిక్కెట్లు ఉన్నాయి. రోజుకి 500 చోప్పున 15 వేల టిక్కెట్లు విడుదల చేసింది టిటిడి. శ్రీవాణి టిక్కెట్లు విక్రయాలు పూర్తి అయితే టిటిడి ఖజానాకు 15.75 కోట్లు చేరనుంది.