హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది : రోజా

-

హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది అని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వస్తే ప్రజలకు మంచి చేస్తారని భావించారు.. కానీ ఇప్పుడు మీరు ఎవరికి ఏం చేసారో చెప్పండి.. రౌడీల్లాగా మాట్లాడింది మీరు.. మీ వల్ల రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటో ఒక్కటి చెప్పండి. పవన్, చంద్రబాబుకు నిజంగా హుందాతనం ఉంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని రోజా అన్నారు.

ఈ కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీని కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుపుతున్నారు. అసెంబ్లీకి రాకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండని జగన్ ఎప్పుడో చెప్పారు. ఇంకా అంతకన్నా ఏం చెప్తారు. గతంలో మాకు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే మైకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. గత అనుభవాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం అని ఆర్కే రోజా స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news