ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం : బండి సంజయ్

-

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగమంతా పచ్చి అబద్దాలు, అర్ధ సత్యాలతో నిండిపోయింది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటమి ఖాయమనే భయం ఆయనలో స్పష్టంగా కన్పిస్తోంది. ఇంటెలిజెన్స్ సహా అన్ని సర్వే సంస్థలన్నీ బీజేపీ గెలుపు తథ్యమని తేల్చేశాయి. కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని నివేదికలివ్వడంతో దిక్కుతోచని ముఖ్యమంత్రి హడావుడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఒకే రోజు 3 జిల్లాల్లో 3 మీటింగ్ ల్లో పాల్గొంటూ అబద్దాలాడుతూ, ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రభుత్వానికి ఢోకా లేదు… నాకేం ఫరఖ్ లేదని బుకాయిస్తున్నడు. అంత ధీమా ఉంటే ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చినట్లు.. చరిత్రలో ఇంతవరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఏ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్న దాఖలాల్లేవు. ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఎన్నికల్లో పాల్గొంటూ డబ్బు, అధికార బలంతో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. దీనికితోడు ఓడిపోతే మీ సమస్యలను పరిష్కరించబోనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు అని బండి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news