సీఎం రేవంత్ రెడ్డివి మాటలే పనులు లేవు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

మాట్లాడితే తాను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటానంటూ కామెంట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయంలో అడ్డుకున్నానో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను మళ్లిస్తూ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతుందని పేర్కొన్నారు. నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తే.. రేషన్ కార్డులపై కేంద్రం ఆనవాళ్లు లేకుండా చేసిందని ఫైర్ అయ్యారు. 

పీఎంఏవై పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తే.. ఇందిరమ్మ ఇళ్లని అందుకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తుందంటూ కాంగ్రెస్ పెద్దలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మాట్లాడితే తాను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటివరకు కేటాయంచిన నిధులపై చర్చకు సిద్దమా..? అని సీఎంను ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news