బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగింది. మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు మీద తాజాగా మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఆయనపై 351(2) R/W3, (5) BNS సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిత్యం తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చక్రధర్‌గౌడ్ పోలీసులకు వివరించారు.దీంతో బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో A1గా వంశీకృష్ణ, A2గా హరీశ్‌రావు, A3గా సంతోష్ కుమార్, A4గా రాములు, A5గా వంశీ పేర్లను చేర్చారు. కాగా, ఇటీవలే హరీశ్ రావు మీద కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే.