కేసీఆర్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం : మహేష్ గౌడ్

-

కార్యకర్తల కృషి తో అధికారం లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పీసీసీగా రేవంత్ రెడ్డి.. అంతకు ముందు ఉత్తమ్ ల పోరాటం పార్టీని నిలబెట్టాయి అని ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఇక మేమున్నాం అని రాహుల్ గాంధీ ..సోనియా గాంధీ ప్రోత్సహించారు. పదేళ్ల BRS హయంలో కంటే.. ఏడాదిలో కాంగ్రెస్ ఎన్నో చేసింది. ఇప్పటి వరకు 56 వేల ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గత పదేళ్లలో ఇచ్చిన జాబ్స్ కంటే కాంగ్రెస్ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది.

ఇక పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 11 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ఏడాదిలో 21 వేల కోట్లు రుణమాఫీ ఇచ్చాం. ఈ ప్రభుత్వం నిరుద్యోగులది.. పేద ప్రజలది.. వెనకబడిన కులాల పార్టీ కాంగ్రెస్. అయితే మేము రుణమాఫీ చేసి…ఉద్యోగాలు ఇచ్చి ప్రచారం చేసుకోలేక పోతున్నాం అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news