కేసీఆర్ వల్లనే SLBC కి ఈ పరిస్థితి : గుత్తా సుఖేందర్ రెడ్డి

-

కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పెట్టిన శ్రద్ధలో 20 శాతం పెట్టినా.. SLBC పూర్తి అయ్యేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. కాళేశ్వరం కి ఇచ్చిన అడ్వాన్స్ లు SLBC ప్రాజెక్టులకు ఇస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేదని మండిపడ్డారు గుత్తా సుఖేందర్ రెడ్డి. టన్నెల్ ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలని.. రాజకీయం చేయవద్దని తెలిపారు. 

ఇంతకు ముందు శ్రీశైలం పవర్ హౌజ్ లో ప్రమాదం జరగలేదా..? కాళేశ్వరంలో పంపు హౌస్ లు మునిగి జనాలు చనిపోలేదా..? అని ప్రశ్నించారు. SLBC ఎందుకు ఆలస్యం అయిందనేది మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలియనిది కాదని.. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది అన్నారు. ప్రమాదం జరిగిన రెండు గంటల్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నాడని.. నేతలు ఎంత మంది అక్కడికి పోతే సహాయక చర్యలకు అవరోధమని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news