ఎల్లుండి అంటే 5 వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఎల్లుండి ఉదయం 9 నుండి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 9 లక్షల 96,971 మంది తెలంగాణ రాష్ట్ర ఇంటర్ పరీక్షలు రానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 ఉండగా…. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5, 08,523 మంది ఉన్నారు. మొత్తం పరీక్ష కేంద్రాలు 1532 ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విజిలేటర్స్ 29,992 మంది ఉంటారు.

పరీక్ష సమయం లో ఎగ్జామ్ సెంటర్ ల సమీపం లో ఉన్న జీరాక్స్ సెంటర్ ల మూసి వేయనున్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో సీసీ కెమెరా ల ఏర్పాటు చేయడమే కాకుండా… కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేశారు. ఏ కారణం చేతనైనా విద్యార్థులకు హల్ టికెట్స్ ఇవ్వక పోతే సంబంధిత కాలేజ్ ల పైన చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష సమయానికి అరగంట(ఉదయం 8.30 కి) ముందే అభ్యర్థులు పరీక్ష హల్ లో ఉండాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.