వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ అమలు చేయడం లేదు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

-

కాంగ్రెస్ రైతుల కోసం ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ అమలు కావడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతుబంధు, రైతు బీమా దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రూ.6,122 కోట్లు రైతులకు ప్రీమియం కేసీఆర్ ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్, రైతు బంధు, రైతు బీమా రావడం లేదు అని ఆరోపించారు. రైతు భరోసా కోసం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి రూ.10వేల కోట్లు తెచ్చి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి.. చీఫ్ సెక్రటరీతో ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోంది. రైతుల పంటలు ఎండుతుంటే రైతు కమీషన్ ఏం చేస్తోంది. ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రులు రైతుల దగ్గరకు వెళ్లండి నిరంజన్ రెడ్డి సూచించారు.

SLBC టన్నెల్ కూలితే కేసీఆర్ కారణమని అంటున్నారు. రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకపవడానికి కారణం కేసీఆర్ అని అంటారా..? అని మాజీ నిరంజన్ రెడ్డి అడిగారు. రైతుల దగ్గరకు వెల్లే ధైర్యం మంత్రులకు ఉందా..? రైతులు ఆత్మహత్యలు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు. సమయం వచ్చినప్పుడు రైతులు ప్రభుత్వాన్ని శిక్షించండి అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news