ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు సీఎం కీలక సందేశం..!

-

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు  రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఒక సందేశంలో విషెస్ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తుకు మరో అడుగు వేస్తున్న తరుణంలో లక్ష్యంపైనే గురిపెట్టాలని సందేశంలో సీఎం తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థినీ విద్యార్థులు అందరికీ విజయోస్తు.. చెబుతూ సందేశంలో పేర్కొన్నారు. ఈ వివరాలను తెలంగాణ సీఎంవో తన ఎక్స్ ఖాతా ద్వారా సీఎం సందేశాన్ని పంచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 96 వేల 971 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news