ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టీడీపీ అధ్యక్షుడి కారుకు నిప్పు ఎత్తారు. అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు అంటే మంగళవారం రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు విజయగౌడ్ కారుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిప్పంటించిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇక రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు విజయగౌడ్ కారు ప్రమాదం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
టీడీపీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ కారుకు నిప్పు
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ గౌడ్
ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది pic.twitter.com/2tS5RHbRwC
— BIG TV Breaking News (@bigtvtelugu) March 11, 2025